బొగ్గు గనిలో ప్రమాదం. కార్మికుడు మృతి

బొగ్గు గనిలో ప్రమాదం. కార్మికుడు మృతి

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా లోని RK-5 బి సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. బొగ్గు గని  పైకప్పు కూలి కందె రాములు అనే కార్మికుడు మృతి చెందాడు. మృతదేహాన్ని రామకృష్ణాపుర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం వివరాలను సింగరేణి యాజమాన్యం గోప్యం గా ఉంచింది. రాములు మృతికి యాజమాన్యం నిర్లక్షమే కారణమంటూ కార్మిక సంఘాలు, కార్మికులు ఆందోళన చేస్తున్నారు.