నస్పూర్, వెలుగు: మంచిర్యాల పట్టణంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ఐటీఐ ప్రాంగణంలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు జాబ్మేళా నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్లోని నివ్ ల్యాండ్ ల్యాబరేటరీస్లో 300 మందికి అవకాశం ఉందని.. ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ/ బీఎస్సీ కెమిస్ట్రీ చదివినవారు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
