గుండె సంరక్షణపై మెడికవర్​ ఆధ్వర్యంలో మినీ వాకథాన్

గుండె సంరక్షణపై మెడికవర్​ ఆధ్వర్యంలో మినీ వాకథాన్

మాదాపూర్, వెలుగు: వరల్డ్ హార్డ్ డే సందర్భంగా గురువారం మాదాపూర్​ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది మినీ వాకథాన్ నిర్వహించారు. గుండె సంరక్షణపై, ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించారు. హాస్పిటల్ ​నుంచి హైటెక్స్​వరకు కొనసాగిన వాక్​ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గుండెపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సీనియర్ కార్డియాలజిస్ట్​ డా. బాలాజీ మాట్లాడుతూ.. గుండెపోటు రావడానికి ఒళ్లు నొప్పులు, నీరసం, నిద్రలేమి, ఆందోళన, కోపం, డిప్రెషన్, మతిమరుపు లాంటివి సాధారణ కారణాలన్నారు. వీటిని ముందుగా గుర్తించి ట్రీట్​మెంట్ ​తీసుకుంటే హార్ట్ ​స్ట్రోక్ ​రాకుండా జాగ్రత్త పడొచ్చన్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. వాక్​లో డాక్టర్లు ‘యూజ్ హార్ట్​ఫర్​ఎవ్రీ హార్ట్’ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ ప్రమోద్​రెడ్డి, క్లస్టర్ హెడ్ దుర్గేశ్, సెంటర్ హెడ్​మాత ప్రసాద్, డా.అనూష, సిబ్బంది  పాల్గొన్నారు.