కనీస పెన్షన్​ త్వరలో అమలు

కనీస పెన్షన్​ త్వరలో అమలు

కోల్​బెల్ట్, వెలుగు: బొగ్గు సంస్థలో పనిచేసి రిటైర్​ అయిన కార్మికులకు కనీస పెన్షన్ కింద రూ.వెయ్యి చెల్లించేలా సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని బీఎంఎస్ ​నేషనల్​లీడర్, బొగ్గు పరిశ్రమల ఇన్​చార్జ్ ​కొత్త కాపు లక్ష్మారెడ్డి(సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు మెంబర్), సింగరేణి కోల్​మైన్స్​కార్మిక సంఘ్ స్టేట్​ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య శనివారం తెలిపారు.

పెన్షన్ పై సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. 22న ఢిల్లీలో జరిగిన సీఎంపీఎఫ్​ట్రస్టీ బోర్డు సభ్యుల180వ బోర్డు మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాలను శ్రీరాంపూర్​లో వారు మీడియాకు వెల్లడించారు. కనీస పెన్షన్​అమలు చేస్తామని ట్రస్టీ బోర్డు హామీ ఇచ్చిందని, సీఎంపీఎఫ్​లో కొత్త రిక్రూట్​మెంట్ ద్వారా సిబ్బందిని పెంచనున్నారని చెప్పారు.