కరీంనగర్ జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్ జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి, వెలుగు: అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి పదేళ్ల నిరీక్షణకు కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం తెరవేసిందని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌తో కలిసి 1,658 లబ్ధిదారులకు రేషన్‌‌‌‌కార్డులు పంపిణీ చేశారు. అలాగే 67 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను,రూ.65 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రేషన్‌‌‌‌కార్డు రానివారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో దాదాపు పదేండ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. 

అంతకుముందు మల్లన్నపేటలో జగిత్యాల నుంచి మల్లన్నపేటకు ఆర్టీసీ బస్‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం గొల్లపల్లి మండలకేంద్రంలో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న స్టేడియం నిర్మాణానికి ఆరెకరాల భూమి కేటాయిస్తూ భూమిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి గొల్లపల్లి మండల యువకులు, స్పోర్ట్స్ అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో  ఆర్డీవో మధుసూదన్, డీఎస్‌‌‌‌వో జితేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, తహసీల్దార్ వరందన్, ఎంపీడీవో రాంరెడ్డి పాల్గొన్నారు.