బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జగిత్యాల/ధర్మపురి, వెలుగు: బీసీలకు 42శాతం రిజర్వేషన్​అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రితోపాటు విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా హాజరయ్యారు. అడ్లూరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు.

 బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉనికిని కోల్పోతుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిన పనులు ఏమిటో చెప్పాలని, బీసీలపై ప్రేమ ఉంటే బీసీ నేతను ఆ పార్టీకి అధ్యక్షుడిగా నియమించాలని సవాల్​ విసిరారు. కాంగ్రెస్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిందని, పార్టీలో వ్యక్తిగత కోపాలు, ఫిరాయింపులకు చోటులేదన్నారు. ఇతర పార్టీ లీడర్లు మనలో ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కార్యకర్తలు అపోహలకు లోనుకాకుండా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో బీసీ సామాజికవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.