
- ఇకపై స్టీలు పాత్రల్లో వంట
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్
తిమ్మాపూర్, వెలుగు: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్( సీవోఈ)లో విద్యార్థులకు సరిపడా టీచర్లు 15 రోజుల్లోగా నియమించాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ఆధికారులను ఆదేశించారు.. అల్గునూ ర్లోని సీవోఈలో స్టీల్ పాత్రల్లో వంటావార్పు' కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభిం చారు. అంతకుముందు కిచెన్, డైనింగ్ హాల్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం మంంత్రి మాట్లాడుతూ.. అల్యూమినియంపా త్రల్లో ఆహారం నిల్వ ఉంచడంతో ఆరోగ్యసమ స్యలు ఎదురవుతున్నాయని, రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో స్టీల్ పాత్రల్లో వంట చేయాలని నిర్ణయించామని, తొలుత అల్గునూర్ లోని సీఈఓలోనే ప్రారంభించినట్లు చెప్పారు. స్కూళ్లలోఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ సంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి, కలెక్టర్ పమేలా సత్పతికి సూచించారు.
అనంతరంగు రుకులంలో మొక్కలు నాటారు. గురుకులాల సెక్రటరీ వర్షిణి మాట్లాడుతూ మూడు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో స్టీలు పాత్రల్లో వంట చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు
అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తా మన్నారు. కాళేశ్వరం పాపాల చిట్టాను డైవర్ట్ చేసేందుకు చలో కన్నెపల్లిని బీఆర్ఎస్ తలపె ట్టిందని ఆరోపించారు. రైతులకు సకాలంలో సాగునీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.