మంత్రికి స్టే ఇచ్చే అధికారం లేదు.. కలెక్టరే ఫైనల్

మంత్రికి స్టే ఇచ్చే అధికారం లేదు.. కలెక్టరే ఫైనల్

హైదరాబాద్: పని చేయని సర్పంచ్‌‌లు, చైర్‌‌పర్సన్లు, వార్డు మెంబర్లు, కౌన్సెలర్లపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. కలెక్టర్ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారం మంత్రి నుంచి తొలగించామన్నారు. ‘‘ఇప్పటివరకు సర్పంచ్‌‌ను తొలగించే అధికారం కలెక్టర్‌‌కు ఉంది. ఒక సర్పంచ్‌‌ను కలెక్టర్ తొలగిస్తే.. సదరు సర్పంచ్ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ఇంట్లో తేలుతడు. 12 గంటలకు ఇద్దరు మంత్రి ఇంట్లో కనిపిస్తరు. సస్పెండ్ ఆర్డర్‌‌పై ఒంటి గంటకు స్టే వస్తది. మళ్లా కలెక్టర్ ముందు కాలర్ ఎగరేసుకుంటూ కూర్చుంటడు సర్పంచ్.  అందుకే ఇప్పుడు మంత్రికి స్టే ఇచ్చే అధికారాన్ని తీసేసినం” అని స్పష్టం చేశారు.