టేక్మాల్, వెలుగు: టేక్మాల్ లోని హజ్రత్ షాహిద్ అల్లా దర్గా ఉర్సు ఉత్సవాల్లో శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ నూరుల్లా హసేని హుసేని ఖాద్రి ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దర్గా అభివృద్ధికి ప్రత్యేక నిధులతో కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ, సీసీ రోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
టేక్మాల్ కింది వీధి నుంచి గంధం, చాదర్ ను ఊరేగింపుగా తీసుకువచ్చి దర్గాలో సమర్పించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ మల్లారెడ్డి, సర్పంచులు సుధాకర్, అవినాశ్, భూమిరెడ్డి, సంగమేశ్వర్, ఉప సర్పంచ్ శంకరయ్య, నాయకులు మనికిషన్, పాపయ్య, కిషోర్, సాగర్, రాజు, సదాశివుడు, మహేశ్ రెడ్డి పాల్గొన్నారు.
