
పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో మైనింగ్, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులు అన్నారు. పెద్దపల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి జిల్లాకు వస్తున్న వివేక్ వెంకటస్వామిని ఆగస్టు 2న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణకు చెందిన 8 మంది ఎంపీలతో కలిసి వివేక్ చేసిన పోరాటం మరుపురానిదన్నారు. అలాంటి గొప్ప నాయకున్ని సన్మానించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమావేశంలో పి.మల్లికార్జున్, సయ్యద్సజ్జాద్, బొంకూరి కైలాసం, ఉనుకొండ శ్రీధర్పటేల్, బండారి సునీల్, శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు.
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆగస్టు 2న నిర్వహించనున్న రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆత్మీయ సన్మానానికి అన్నివర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని గోదావరిఖని మాల సంఘం అధ్యక్షుడు సోగాల వెంకటి, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ కోటేశ్వర్లు కోరారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీటింగ్‌లో వారు పాల్గొని మాట్లాడారు. మీటింగ్‌లో మాల సంఘం లీడర్లు బద్దం డానియెల్, కొండ కుమార్, మర్రి ఐలయ్య, భూమల్ల చందర్, నర్సింగ్ దొర, లక్ష్మణ్‌రావు, పిట్టల వెంకటి, లింగమూర్తి, రామస్వామి, వెంకటేశ్వర్లు, మొండయ్య
పాల్గొన్నారు.