పేదల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన : ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పేదల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్  పాలన : ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: పేదల అభివృద్ధే లక్ష్యంగా  రాష్ట్రంలో పాలన సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంథని పట్టణంలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ,  మహిళా శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు రేషన్ కార్డుల జారీ చేయాలని ప్రతిపక్షంలో అనేక సందర్భాలలో ధర్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు కొత్త రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు పంపిణీ చేసి, సన్నబియ్యం ఇస్తున్నట్లు చెప్పారు.

 గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం ద్వారా రీ సైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఠాలే బాగుపడ్డాయన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం గతంలో పెద్ద సంఖ్యలో మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లను ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామన్నారు. మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి రాణించేందుకు వారి కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

 వ్యాపారాలు నిర్వహించేందుకు కావాల్సిన నైపుణ్యాల శిక్షణకు పెద్దపల్లి జిల్లాలో వీ హబ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం పట్టణంలో సెంట్రల్ లైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాయ్స్ హాస్టల్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఇటీవల ఎన్నికైన కమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, మంథని మార్కెట్ కమిటీ సభ్యులను మంత్రి సన్మానించారు. ఆయన వెంట లైబ్రరీ సంస్థ చైర్మన్ నన్నయగౌడ్,  లీడర్లు అయిలి ప్రసాద్, సదానందం, తిరుపతి యాదవ్, కాచే, శ్రీనివాస్, బాలాజీ పాల్గొన్నారు.