ఇంకా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం దురదృష్టం

ఇంకా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం దురదృష్టం

అంబేద్కర్ జయంతి, వర్ధంతి అంటూ ఉత్సవాల కోసం కాకుండా.. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి ఈటల.. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల కోసం.. అణచి వేతకు గురైన వారి కోసం పోరాడిన మహానీయడు అంబేద్కర్ అని మంత్రి అన్నారు. ‘అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు కలిసిమెలసి ఉండాలని కోరుకున్నారు. స్వేచ్ఛా, సమానత్వం ఆయన ఆశయం. కుల రహిత, మత రహిత సమాజం అంబేద్కర్ లక్ష్యం. ఈనాటికి కూడా రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయడం దురదృష్టకరం. పాలకులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పఠనం చేసి ప్రజలకు మేలు చేయాలి. దళితులు ఈనాటికీ ఇంకా భయంకరమైన జీవితం గడుపుతున్నారు. కేవలం ఉత్సవాల కోసం కాకుండా ఆశయాల సాధన కోసం పని చేయాలి’ అని మంత్రి ఈటల అన్నారు.