చెట్లు బతుకకపోతే సర్పంచ్ ల పదవులు ఉండవు

చెట్లు బతుకకపోతే సర్పంచ్ ల పదవులు ఉండవు

ఈ సంవత్సర కాలంలో చేపట్టబోయే అతి ముఖ్యమైన పనులను ,  5 ఏళ్లలో చేయాల్సిన పనులను ఈ 30 రోజుల్లో గుర్తించాలని వరంగల్ లో నాయకులకు, కార్యకర్తలకు సూచించారు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి నీళ్లు ఇవ్వడంలో విజయవంతం అయ్యామని చెప్పారు. గ్రామాలను బాగు చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.

“ఊరిని శుభ్రంగా ఉంచాలి. అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఒక తాటి మీద నడవాలి. నిధుల కొరత లేదు. CM KCR చెప్పినట్టు చేస్తే అభివృద్ధికి డబ్బులు ఇస్తాం.  ఒక క్రమశిక్షణతో ముందుకు నడిచి ఊరిని బాగు చేయండి. ఊరిని శుభ్రంగా ఉంచక పోతే… ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే జరిమానా విధించండి. చెత్త రోడ్ మీద వేస్తే  రూ.200 ఫైన్ కు ఒప్పుకున్న గ్రామస్తులకు అభినందనలు. మహిళలు చైతన్యం చూపిస్తే గ్రామీణ వికాసం సంపూర్ణవుతుంది.

గ్రామ అభివృద్ధికి కష్టపడే ప్రతి మహిళకు రూ.3 లక్షలు ఇప్పిస్తా. మహిళలు ఆర్ధికంగా ఎదగాలి. అప్పుడే ఆ కుటుంబం బాగుంటది. పనులన్నీ వదిలి పెట్టి ఒక్కసారైనా శ్రమదానం చేయాలి. ఇంటికి ఎన్ని చెట్లు  కావాలో అవే ఇస్తాం. వాటిని కాపాడకపోతే ఫైన్ తప్పనిసరి. చెట్లను కాపాడని వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చేయండి. ప్రతీ తీర్మానాన్ని ఒక చట్టంలా చేసుకోండి. తీర్మాణాలన్నీ కరెక్టుగా అమలైతేనే మీకు నిధులు ఇస్తా. చింత చెట్లు రూ.కోటి 20 లక్షలు అవసరం ఉన్నాయి. గ్రామాల్లో బాగా నాటి…. పెంచండి. ప్రతీ ఇంట్లో కృష్ణ తులసి ఉండాలి. రాష్ట్రంలోని ప్రతీ పల్లె గంగదేవిపల్లిలా అభివృద్ధి అవ్వాలి” అన్నారు మంత్రి ఎర్రబెల్లి.