
మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన సైడే అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల మినహా మిగతా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ కే మొగ్గు అని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో.. వరంగల్ లోని 9 మున్సిపల్ స్థానాలకు 9 స్థానాలు టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పారు ఎర్రబెల్లి. ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతూ.. సమ్మెపై ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటిస్తుందని, తాను వ్యక్తిగతంగా స్పందించడానికి ఏమీ లేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యతిరేకంగా లేదని, యూనియన్ల పై మాత్రమే సీరియస్ గా ఉందని చెప్పారు. ఆర్టీసీ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని, 50 శాతం ప్రైవేటీకరణ చేస్తే సమస్యను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుందని దయాకర్ రావు అన్నారు.