కాంగ్రెస్ మా నాన్నను ఓడగొట్టింది..అందుకే కోపం: ఎర్రబెల్లి

కాంగ్రెస్ మా నాన్నను ఓడగొట్టింది..అందుకే కోపం: ఎర్రబెల్లి

నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాలలో చెత్త సేకరణ, పాడు బడ్డ బావులు పూడ్చడం, రోడ్లు వేయడం వంటి అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ సమితి అధ్యక్షుడి ఉన్న తమ నాన్న పోటీ చేశాడని..అయితే టికెట్ ఇచ్చిన పార్టీయే తమ నాన్నను ఓడగొట్టిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందుకే అప్పటి నుండి కాంగ్రెస్ అంటే నాకు కోపమని చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాలు ఏ పార్టీలో ఉండవన్నారు. తాను మొదట ఎమ్మేల్యేగా ఉన్నప్పుడు తన ఇంటికి మనుమళ్లు, మనవరాళ్లు రావాలంటే భయపడే వారని.. కరెంటు పోతది రాను అని చెప్పేవారన్నారు. మనమళ్లు, మనవరాళ్లు ఇబ్బంది పడకూడదని జెనరేటర్ తెచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు జెనరేటర్ అవసరం లేకుండా 24 గంటల కరెంటు వస్తుందని అన్నారు.