భూములు అందుబాటులో లేవు.. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆలస్యం

భూములు అందుబాటులో లేవు.. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆలస్యం

పాలకుర్తి నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నట్లు.. కొన్ని చోట్ల భూములు అందుబాటులో లేకపోవడం వల్ల సాధ్యం కాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. 65 ఇండ్లను త్వరలోనే పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగిస్తామని వెల్లడించారు. రాయపర్తి మండలం ఊకల్ గ్రామం SC కాలనీలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. మరికొన్ని చోట్ల దొరికిన భూముల్లో ఆలస్యంగా మొదలు పెడుతున్నట్లు, నిజమైన అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

అలాగే దళిత బంధును అర్హులైన నిరుపేదలకు ముందుగా అందేట్లు చూడాలని అధికారులకు సూచించారు. అంతకంటే ముందు.. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం జీకే తండాకు మంత్రి ఎర్రబెల్లి చేరుకున్నారు. కరెంట్ షాక్ గురై చికిత్స  పొందుతున్న ఇద్దరు రైతులను ఆయన పరామర్శించారు. అనంతరం తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చేరుకుని ఇటీవలే చనిపోయిన వంగ సోమనర్సయ్య అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా చెక్కును అందచేశారు.