పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి

పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి

వరంగల్: పామాయిల్ సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జిల్లాలోని  పర్వతగిరిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ మొక్కలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాటారు. అనంతరం ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ సాగుపై ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి మాట్లాడారు. చీడ పీడలను తట్టుకొని పామాయిల్ మంచి దిగుబడిని ఇస్తుందన్నారు. పామాయిల్ సాగుతో ఎకరానికి దాదాపు రూ.2 లక్షల ఆదాయం వస్తుందని స్పష్టం పేర్కొన్నారు.

చుట్టుపక్కల గ్రామాల రైతులను పామాయిల్ సాగు వైపు మళ్లించేందుకే తన వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ సాగు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పామాయిల్ సాగు కోసం ప్రభుత్వ ఇచ్చే సబ్సిడీతో పాటు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయన్నారు. ఒకప్పుడు నీటి కొరతతో రైతులు ఇబ్బందిపడ్డారన్న మంత్రి... కానీ కాళేశ్వరం వల్ల  సాగు నీటి కష్టాలు తప్పాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏడాది పొడవునా సాగు, తాగు నీరు వస్తోందని తెలిపారు.