80 శాతం మందికి కరోనా వచ్చిపోయింది

80 శాతం మందికి కరోనా వచ్చిపోయింది

రాష్ట్రంలో 80 శాతం మందికి కరోనా వచ్చిపోయిందన్నారు హెల్త్ మినిష్టర్ ఈటెల రాజేందర్.  నిమ్స్ స్టెమ్ సెల్స్ ల్యాబ్ ప్రారంభించారు మంత్రి. ఈ ల్యాబ్ లో రోజుకు 10 వేల టెస్టులు చేయొచ్చన్నారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడేవారికి ఇది ఉపయోగమన్నారు. కరోనా విషయంలో ఐసీఎంఆర్ ఎన్నో స్టాండ్స్ మార్చినా…తాము ముందు నుంచి ఒకే స్టాండ్ తో ఉన్నామన్నారు. తెలంగాణలో ప్రతి గడపలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. కరోనాతో మున్ముందు సహజీవనం చేయాల్సిందేనన్నారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. నిమ్స్ లో ఓపీ సేవలు మరితం పెంచుతామన్నారు. కొత్త ఓపి బ్లాక్ ప్రారంభిస్తామన్నారు. నిమ్స్ ను మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిమ్స్ స్థాయిలో 4 హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. 80 శాతం మందిలో కరోనా వచ్చిపోయిందన్నారు. ఇతర జబ్బులు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు.

కేబుల్ బ్రిడ్జిపై రోడ్డుకు అడ్డంగా సెల్ఫీలు