తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు: మంత్రి గంగుల

తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు: మంత్రి గంగుల

రాష్ట్రంలో  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. తరుగు పేరుతో  కోతలు విధించే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి పనులపై జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో  మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా  కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. 

కరీంనగర్ అభివృద్దికి తొలిసారిగా జీవో నెం.4   విడుదల చేయడంపై మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. నగర అభివృద్దికి ఉద్యోగులు సేవా భావంతో పనిచేయాలని కోరారు. కరీంనగర్ వ్యాప్తంగా అత్యాధునిక హంగులతో 10 చోట్ల ఐలాండ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. స్మార్ట్ సిటీ పనులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు.