మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల 

మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల 

కార్మికులపై భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా అశోక్ నగర్లోని సామిల్ జంక్షన్లో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెంచి.. పేదలకు పంచాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల రూపంలో ఖర్చు చేస్తుంటే.. కేంద్రం మాత్రం పేదల పొట్ట కొడుతుందని అన్నారు.  ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు బడుగు, బలహీన వర్గాలకు అందకుండా పోతున్నాయని గంగుల ఆవేదన వ్యక్తంచేశారు. 

కేంద్ర ప్రభుత్వం పేదలను ఆదాయాన్ని కొల్లగొట్టి దాన్ని అదానీ, అంబానీలకు పంచుతున్నారని గంగుల మండిపడ్డారు. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని విమర్శించారు. 714 జీవోతో మోటారు వాహనాల ఫిట్ నెస్ పేరుతో ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులపై భారం మోపుతున్నారని గంగుల ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికులు, రైతులపక్షాన నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

FOR MORE NEWS..

కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేసిండు

భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర