భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర

భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర

వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. కమర్షియల్ సిలిండర్ పై రూ.102.50  పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో 19 కిలోల సిలిండర్ ధర రూ. 2,562 లకు పెరిగింది. ఢిల్లీలో రూ. 2,355గా ఉంది. మరోవైపు 5 కిలోల సిలిండర్ ధర రూ. 655 గా ఉంది. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం14.2 కిలోల సిలిండర్ ధర రూ.1002గా ఉంది.