ఉచిత కరెంట్ గుజరాత్ లో ఎందుకివ్వడం లేదు?

ఉచిత కరెంట్ గుజరాత్ లో ఎందుకివ్వడం లేదు?

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయ్యిందన్నారు మంత్రి హరీష్ రావు. ఇక్కడి పథకాలు అమలు చేయాలని.. మహారాష్ట్ర ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి . తర్వాత బాసర జంక్షన్ లో శివాజీ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం ముథోల్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో అమలయ్యే పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అనేదానిపై  చర్చకు రావాలన్నారు. 24 గంటల పాటు ఉచిత కరెంట్ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బడ్జెట్లో రూ. 25 వేల కోట్ల ఉపాధి నిధుల్లో  కేంద్రం కోత విధించిందన్నారు. యూపీలో ఈ నెల 10న ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతాయన్నారు.

సీపీ నోట టీఆర్ఎస్ స్క్రిప్ట్.. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు