సిద్దిపేట స్ఫూర్తిని నలుదిశలా చాటాలి : మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట స్ఫూర్తిని నలుదిశలా చాటాలి : మంత్రి హరీశ్​రావు
  •     హాఫ్​ మారథాన్ కార్యక్రమంలో మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు : ప్రతి రంగంలో ఆదర్శంగా నిలుస్తున్న  సిద్దిపేట స్ఫూర్తి  నలుదిశలా చాటాలన్నదే తన తపన అని మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన హాఫ్​ మారథాన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాఫ్ మారథాన్ కార్యక్రమ నిర్వహణకు  పూనుకున్నప్పుడే అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు.  ప్రతిఏటా ఆగస్టు 6న సిద్దిపేట లో హాఫ్​ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత హాఫ్ మారథాన్ నిర్వహించడం సిద్దిపేటకే గర్వకారణమన్నారు.  హైదరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 100 కిలో మీటర్లు రన్నింగ్ చేస్తూ వచ్చిన శ్రీకాంత్, సైక్లింగ్ చేస్తూ వచ్చిన డాక్టర్ నాగలక్ష్మిని ఆయన అభినందించి సన్మానించారు.  కార్యక్రమంలో సీపీ ఎన్.శ్వేత పాల్గొన్నారు.

హాఫ్ మారథాన్ విజేతలు 

21కే  మహిళా విభాగంలో ఫస్ట్​ప్లేస్​లో ఉమ(సూర్యపేట), సెకండ్​ ప్లేస్​లో మల్లిక(నల్లగొండ), థర్డ్ ​ప్లేస్​లో వడ్డే నవ్య నిలిచారు. పురుషుల విభాగంలో ఫస్ట్​ప్లేస్​లో రమేశ్ ​చంద్ర రమావత్(నాగర్ కర్నూల్), సెకండ్​ ప్లేస్​లో -మోతి చౌదరి(ఉత్తర ప్రదేశ్), థర్డ్​ప్లేస్​లో గీయో ఆంటోనీ(నాగర్ కర్నూల్) వచ్చారు. 10కే మహిళల విభాగంలో ఫస్ట్​లో స్వప్న కడావత్ (నాగర్ కర్నూల్), సెంకడ్​లో -కావ్య(మంచిర్యాల), థర్డ్​లో గగన శ్రీ(హైదరాబాద్) నిలిచారు. పురుషుల విభాగంలో సునీల్ కుమార్(మహారాష్ట్ర ), మనీశ్​ రాజపుత్ర్ (మహారాష్ట్ర), మహేశ్​సల్ల(నల్గొండ) వరుసగా ఫస్ట్, సెంకడ్, థర్డ్​ప్లేస్​లో వచ్చారు. 5కే మహిళా విభాగంలో ఫస్ట్​లో విశాలాక్షి (హైదరాబాద్), సెకండ్​లో కృష్ణకుమారి(బీదర్), థర్డ్​లో ఆర్. కీర్తన(నలగొండ) నిలిచారు. పురుషుల విభాగంలో అఖిల్, రాంరెడ్డి, -తిలక్ ఫస్ట్, సెంకడ్, థర్డ్ ​ప్లేస్​లో నిలిచారు. విజేతలకు మంత్రి హరీశ్​రావు, సీపీ ఎన్.శ్వేత నగదు పురస్కారం అందజేశారు. అనంతరం సిద్దిపేట జిల్లాకు కేటాయించిన 15 కొత్త అంబులెన్స్ వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.  

అంధత్వాన్ని అధిగమించిన ఆత్మవిశ్వాసం

వరమడుగు లక్ష్మీనారాయణ ( 28 ) పుట్టుక తో అంధుడు. టీసీఎస్ లో  సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. సిద్దిపేట ఆఫ్ మారథాన్ లో 21కేలో పాల్గొని 2.48 గంటల్లో రేస్ ను పూర్తి చేశాడు. లక్ష్మీ నారాయణను సీపీ ఎన్.శ్వేత అభినందించి నగదు పురస్కారంతో సన్మానించారు.