
ధరణిలో ఉత్పన్నమవుతున్న చిన్న చిన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి త్వరలో ప్రత్యేక చర్యలు చేపడతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ధరణిలో 95 శాతం ఫలితాలు బాగున్న, కేవలం ఐదు శాతం సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పక్షం రోజుల్లో ఉన్నతాధికారులు ప్రజల వద్దకు వెళ్లి మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తారని తెలిపారు. ఇక ప్రైవేటు పాఠశాలలకు దీటుగా 7,300 కోట్ల ఖర్చుతో మన ఊరు మన బడి కింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రతి పేదింటి బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్న కోరికను గుర్తించిన సీఎం కేసీఆర్ ఈ ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామన్న మంత్రి.. సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 3లక్షల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 40లక్ల ల మందికి పింఛన్లు అందిస్తున్నామని, త్వరలోనే 57ఏళ్ళు దాటిన వారికి పింఛన్లు ఇస్తామన్నారు.