
హైదరాబాద్, వెలుగు: ఖమ్మంలో నార్మల్ డెలివరీల శాతం పెరిగేలా కృషి చేసినందుకు ఆ జిల్లా కలెక్టర్ గౌతమ్‌ను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఖమ్మం ఎంసీహెచ్‌లో కలెక్టర్ చేపట్టిన చర్యలతో.. గత వారం 45 శాతం నార్మల్ డెలివరీలు జరిగాయి. తొలుసూరి కాన్పుల్లోనూ.. 80 శాతం నార్మల్ డెలివరీలు జరిగాయి. దీంతో కలెక్టర్‌ను అభినందిస్తూ హరీశ్‌రావు సోమవారం వాట్సప్ మెసేజ్ చేశారు. ఎంసీహెచ్‌లో అమలు చేసిన వ్యూహమేంటో తెలిపాలని కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. ఆ వ్యూహాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచిస్తూ.. కలెక్టర్ల గ్రూపులో మంత్రి హరీశ్‌రావు మెసేజ్ చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..