కోదాడ: ఐదు నెలల సర్వీస్ మిగిలి ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సర్పంచ్గా పోటీ చేసిన ఎస్ఐ ఓడిపోయిన ఘటన కోదాడ మండలంలో వెలుగుచూసింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్వర్లు ఓటమిపాలయ్యారు. రెండవ విడత ఎన్నికల్లో ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గుడిబండ గ్రామంలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి.. రేషన్ డీలర్ అయిన నాగయ్య చేతిలో 10 ఓట్ల తేడాతో వెంకటేశ్వర్లు ఓడిపోవడం గమనార్హం.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సూర్యాపేట జిల్లా కోదాడ ఎస్సై పోస్ట్ నుంచి వెంకటేశ్వర్లు వీఆర్ఎస్ తీసుకున్నారు. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు కోదాడ టౌన్పీఎస్లో ఎస్సైగా పని చేసేవారు. కానిస్టేబుల్గా పోలీస్‌శాఖలో చేరిన ఆయన కష్టపడి పైకొచ్చారు. ఎస్సైగా పదోన్నతి పొందారు.
ఐదు నెలల సర్వీస్ మిగిలి ఉండగానే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) నిర్ణయం తీసుకుని ఎన్నికల బరిలోకి దిగారు. తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పిన ఆయనకు గ్రామస్తులు అండగా నిలవకపోవడం గమనార్హం.
