సౌతాఫ్రికాతో మూడో టీ20కి టీమిండియా సిద్ధమవుతోంది. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. రెండో టీ20లో ఓడిపోయింది. ప్రస్తుతం రెండు మ్యాచ్ లు జరిగితే రెండు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. మ్యాచ్ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతోంది. టాస్ 6:30 గంటలకు వేస్తారు. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో లైవ్ టెలికాస్ట్.. జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. రెండో టీ20లో అర్షదీప్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతను ఈ మ్యాచ్ లో బెంచ్ కు పరిమితం కావొచ్చు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్ టన్ సుందర్ కు ఛాన్స్ దక్కనుంది. సుందర్ ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అంచనాలు అందుకున్నాడు. ఈ కారణంగా అక్షర్ పటేల్ కు నిరాశ ఎదురు కావొచ్చు.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇంక ఎనిమిది మ్యాచ్‌లే మిగిలి ఉండటం, కెప్టెన్ సూర్య, గిల్ఫామ్లో లేకపోవడం ఇప్పుడు ఇండియాను ఆందోళనలో పడేశాయి. కాబట్టి వీలైనంత త్వరగా చీఫ్ కోచ్‌గౌతమ్‌గంభీర్‌వీటిని పరిష్కరించాలి. టాప్ఆర్డర్లో ఈ ఇద్దరిలో ఒకర్ని తప్పించి సంజూ శాంసన్‌కు చోటు కల్పించాలన్న డిమాండ్లు కూడా ఎక్కువయ్యాయి. వాస్తవంగా టెస్ట్‌కెప్టెన్‌అయిన గిల్‌ను టీ20 సెటప్‌లోకి తీసుకురావడానికి శాంసన్‌ను పక్కనబెట్టారు.
చీఫ్ సెలెక్టర్ అగార్కర్, గంభీర్ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా దాన్ని సరిదిద్దుకుంటారేమో చూడాలి. మిగతా లైనప్‌లో కూడా కొద్దిగా గందరగోళం కనిపిస్తోంది. రెండో టీ20లో అక్షర్ పటేల్‌ను వన్‌డౌన్‌లో, ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఎనిమిదో స్థానంలో దించడం తీవ్రంగా బెడిసికొట్టింది.
సౌతాఫ్రికాతో మూడో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా
