బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కునాల్ ఖేము లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ హిందీ కామెడీ వెబ్ సిరీస్ "సింగిల్ పాపా". నేహా ధూపియా, మనోజ్ పహ్వా, ఇషా తల్వార్, అయేషా రజా, ప్రజక్తా కోలి, దయానంద్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 12, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంటోంది.
భార్యకి విడాకులిచ్చి, బిడ్డను దత్తను తీసుకున్న ఓ వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడన్న కథాంశంతో రూపొందింది. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో తెరకెక్కించారు డైరెక్టర్స్ శశాంక్ ఖైతాన్, నీరజ్ ఉధ్వాని. ఫన్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ సీన్స్ నవ్విస్తూనే, ఆలోచింపజేస్తాయి. అయితే, కామెడీకి పెద్ద పీట వేసినప్పటికీ ఎమోషనల్ సీన్స్తో మెప్పిస్తుంది.
ఇందులో బేబీని చూసుకోవడం అంత ఈజీగా జరగదు. బేబీ ఏడుపు, డైపర్ చేంజ్, ఫీడింగ్, స్లీప్‌లెస్ నైట్స్ అతనితో పాటు, అతని ఫ్యామిలీ కూడా పరుగులు పెడుతుంది. ఇవన్నీ ఆద్యంతం హిలేరియస్‌గా ఉంటాయి. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు కానీ, వాళ్లు కూడా బేబీ కేర్‌లో ఫెయిల్ అవుతూ లాఫ్టర్ సీన్స్ క్రియేట్ చేస్తారు. ఇకపోతే, ఈ సింగిల్ పాపా వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్‌తో హిందీ ఒరిజినల్ ఆడియోతో పాటు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. IMDBలో 8.1/10 రేటింగ్ ని పొందింది. పూర్తి కథగా చూస్తే..
It’s baap ki baapta time 👶 Single Papa has arrived 💕#SinglePapaOnNetflix pic.twitter.com/n8opw6CCzX
— Netflix India (@NetflixIndia) December 12, 2025
కథేంటంటే:
గౌరవ్ గెహ్లాట్ (కునాల్ ఖేము)కి పిల్లలంటే ఇష్టం. కానీ.. అతని భార్య అపర్ణ (ఇషా తల్వార్) మాత్రం పిల్లల కంటే తన కెరీర్ ముఖ్యం అనుకుంటుంది. అందుకే పిల్లలు కనడానికి నిరాకరిస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవలవుతాయి. చివరకు విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒక రోజు గౌరవ్‌కి తన కారు డిక్కీలో ఒక పసివాడు దొరుకుతాడు. కారుకి తాళం వేయకపోవడం వల్ల ఎవరో బాబుని అందులో ఉంచి వెళ్లిపోతారు. కానీ.. గౌరవ్ అతన్ని పోలీసులకు ఇవ్వకుండా తనతోపాటు తీసుకెళ్లి పెంచుకుంటాడు. అతనికి “అమూల్” అని పేరు పెడతాడు. అయితే.. చైల్డ్ వెల్ఫేర్ అథారిటీలోని రోమిలా నెహ్రూ (నేహా ధూపియా) గౌరవ్‌ను పిల్లల్ని పెంచడానికి అనర్హుడుగా భావించి, తన దగ్గర నుంచి బిడ్డను తీసుకుపోవాలని ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.
