
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తమ రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన డీకే శివకుమార్ .. 24 గంటలు కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి ఓట్లు అడగటం సిగ్గు చేటని విమర్శించారు. మీ ఇల్లు సక్కగా లేదు కానీ ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే .. కంట్రోల్ ఢిల్లీతో పాటుగా కర్ణాటక నుండి కూడా ఉంటుందని ఆరోపించారు. బాచూపల్లిలో కే ఎల్ యునివర్సిటీ కార్యక్రమం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
కృష్ణా జలాలు, ఐటీ వివాదాలు వస్తే మన హక్కులను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందా అని హరీష్ రావు ప్రశ్నించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచాయితీ ఉంది. అప్పుడు కాంగ్రెస్ నేతలు ఎటు వైపు ఉంటారని నిలదీశారు. కర్ణాటక నేతను ఎదిరించే దైర్యం ఇక్కడి కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్ని్ంచారు. తెలంగాణ రక్షణ కేవలం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.