భావితరాల భవితే లక్ష్యం

భావితరాల భవితే లక్ష్యం

భావితరాల భవితే లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీష్ మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గం విద్యా కేంద్రంగా మారుతుందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. ఆత్మవిశ్వాసంతో చదివి మీ లక్ష్యాన్ని చేరాలని విద్యార్థులకు సూచించారు. 

ఇప్పుడు తలవంచి చదివితే ఆ తరువాత తలెత్తుకొనే రోజులు మీవేనని మంత్రి తెలిపారు. కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. భావి తరాల భవితే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. అందరు బాగా చదివి ఎదగాలి అన్నదే తమ ధ్యేయమన్నారు. బీసీ స్టడీ సర్కిల్ కు త్వరలో శాశ్వత భవనం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.