ఈటల నన్ను ఒరేయ్ హరీశ్ అంటున్నాడు

ఈటల నన్ను ఒరేయ్ హరీశ్ అంటున్నాడు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత  ఈటల కొత్త భాష నేర్చుకుంటున్నాడన్నారు. తనకు అన్నం పెట్టి, అక్షరాలు నేర్పి, ఇన్ని పదవులిచ్చిన కేసీఆర్ ను పట్టుకుని “రా” అని సంబోధిస్తున్నాడని తెలిపారు. 

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్...ఆ తర్వాత మాట్లాడారు. నన్ను పట్టుకుని ఈటల రాజేందర్  ఒరేయ్ హరీశ్ అంటున్నాడు.. అదీ ఆయన సంస్కారం అని తెలిపారు. నీలాగా నేను నా సంస్కారం తగ్గించుకోవాలనుకోవడంలేదన్నారు. నీ ఆస్తుల కోసం వామపక్ష భావాలను, సిద్ధాంతాలను వదులుకుని బీజేపీలో చేరావన్నారు. నీ భాష మారినా..మేము మాత్రం నిన్ను రాజేందర్ గారూ అనే సంబోదిస్తాం అని అన్నారు. నీవు అట్లా మాట్లాడావంటే..నీలో ఓటమి ప్రస్టేషన్ కనిపిస్తోందని మాకు అర్థమైందన్నారు.

హుజురాబాద్ లో రాజేందర్ గెలిస్తే..ఒక్క వ్యక్తిగా ఆయన గెలుస్తాడు. ప్రజలుగా మీరంతా ఓడిపోతారన్నారు మంత్రి హరీశ్ రావు. మీరు గెలుస్తారా? ఆయనను వ్యక్తిగా గెలిపిస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీలో చేరగానీ ఈటల పని అయిపోయిందన్న హరీశ్..హుజురాబాద్ లో అభివృద్ధి కొనసాగాలంటే TRS ను గెలిపించాలన్నారు.