ప్రతి పక్షాల ట్రాప్లో పడొద్దు

 ప్రతి పక్షాల ట్రాప్లో పడొద్దు

సిద్దిపేట: దండం పెట్టి చెబుతున్నా... ప్రతి పక్షాల ట్రాప్ లో పడొద్దని మంత్రి హరీశ్ రావు గౌరవెల్లి నిర్వాసితులను కోరారు. గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై  పత్తి మార్కెట్ యార్డులో  నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు  రావద్దనే లక్ష్యంతో ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని, రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆపడం సరికాదని ప్రతి పక్షాలపై ఫైర్ అయ్యారు. 

నాడు  మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయం  పనులు అడ్డుకున్నారన్న మంత్రి... రైతుల బాగుపడటం కాంగ్రెస్, బీజేపీలకు ఇష్టం లేదని ఆరోపించారు. లక్షాలాది ఎకరాలకు సాగునీరు అందించి కోట్లాది క్వింటాళ్ల పంట రావడానికి కారణం అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తోందటే... ప్రతి పక్షాల కళ్ల నుంచి కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. 2013 చట్టం ప్రకారం గౌరవెల్లి నిర్వాసితులకు న్యాయం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో భూనిర్వసితులు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. 

చైనా తెప్పిచంని మోటర్లకు వారంటీ గ్గరపడుతోందని... అందుకు  వెట్ రన్ నిర్వమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కింద మొత్తం 937 కుటుంబాలను గుర్తించామన్న మంత్రి.... 2015లో 683 ఇళ్లకు రూ.83 కోట్లు చెల్లించామని, మిగతా 10 కుటుంబాలు మాత్రమే హైకోర్టను ఆశ్రయించాయన్నారు. గౌరవెల్లి పూర్తయితే దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందునుందని మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తయం చేశారు.