రైతుబంధు ఆపొద్దు..వెంటనే అకౌంట్లో వేయండి

రైతుబంధు ఆపొద్దు..వెంటనే అకౌంట్లో వేయండి

రైతుబంధు నిధులను బ్యాంకులు ఆపొద్దని ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీశ్ రావు. రైతుబంధు సొమ్మును విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని.... పాత బకాయిల కింద వాటిని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై బ్యాంకర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు హరీశ్ రావు. రైతుబంధుకు సంబంధించిన ఏ మొత్తాన్ని ఆపొద్దని ఆదేశించారు. ఒకవేళ సర్దుబాటు చేసినా ఆ మొత్తాన్ని వెంటనే రైతుల అకౌంట్లో వేయాలన్నారు. సమస్య పరిష్కారానికి రైతుల కోసం రెండు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు