ఎలక్షన్ బడ్జెట్ అనుకొని తయారు చేయండి!
V6 Velugu Posted on Jan 27, 2022
హైదరాబాద్, వెలుగు: 2022–23 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ అంచనాలు పక్కాగా రూపొందించాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. బుధవారం బడ్జెట్ తయారీపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ఎలక్షన్ బడ్జెట్ అనుకొని పద్దు తయారు చేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. దళిత బంధుతో పాటు మరో పెద్ద స్కీమ్ ను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోందని, బడ్జెట్ సమావేశాల్లో సీఎం ప్రకటించే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. స్కీమ్స్ అన్నింటికీ నిధుల కేటాయింపులే కాకుండా.. ఆ మేరకు ఖర్చు చేసేలా ఎస్టిమేషన్స్ ఉండాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. జాగా ఉన్నోళ్లు ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల స్కీమ్ అమలుకు కేటాయింపులు పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. ఆదాయ పెంపు మార్గాలపై కూడా ఆఫీసర్లతో మంత్రి చర్చించినట్లు తెలిసింది.
Tagged financial year, Minister Harish rao, Authorities, Budget estimates, thinking of the election