పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళలదే కీలక పాత్ర

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళలదే కీలక పాత్ర

సిద్దిపేట: మూడున్నరేళ్లలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను ఏర్పాటు చేసిన మొదటి పట్టణంగా సిద్ధిపేట నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలోనే తొలిసారిగా రూ.300కోట్లతో సిద్ధిపేటలో నిర్మించిన భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేయనున్నట్లు చెప్పారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమన్న హరీష్ రావు.. సిద్ధిపేటను శుద్ధిపేటగా చూడాలని ఆకాంక్షించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. 

ఒకప్పుడు తాగునీటి సమస్య కారణంగా పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాని సిద్దిపేటలో ప్రస్తుతం ఇంటింటికి శుద్ధమైన గోదావరి నీళ్లు వస్తున్నాయని హరీష్ రావు తెలిపారు. మండుటెండలో కూడా కోమటిచెరువు మత్తడి దుంకుతోందని మంత్రి పేర్కొన్నారు.