పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానాలు

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానాలు

ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు సరైన సమయంలో సరైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పబ్లిక్ హెల్త్ మేనేజ్ మెంట్ పర్సన్ ను నియమిస్తామని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేనేజ్ మెంట్ అకడమిక్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. 

రాష్ట్రంలో వైద్యంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారని హరీష్ రావు తెలిపారు. గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ హెల్త్ డిపార్ట్ మెంట్ కోసం కేటాయించారన్నారు. మెడికల్ సీట్లు సైతం పెరిగాయన్నారు. రాబోయే రోజుల్లో 31 జిల్లాలకు 31 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ తెలిపారు.