
నిమ్స్‌లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామన్నారు వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు. నిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ జెనెటిక్స్ లాబరేటరీ, మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్, అధునాతన వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. నిమ్స్ లో మరో 200 ఐసీయూ బెడ్స్ , 120 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిమ్స్ లో కొత్త పరికరాల కొనుగోలు కోసం 154 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు హరీశ్ రావు.