సిద్ధిపేట ఆస్పత్రిలో రేడియాలజీ హబ్ ప్రారంభం

సిద్ధిపేట ఆస్పత్రిలో రేడియాలజీ హబ్ ప్రారంభం

దేశంలోనే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నొస్టిక్ రేడియాలజీ హబ్ ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి జిల్లా ఆసుపత్రులలో టీ డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రులలో రోగులకు 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.

రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 రేడియాలజీ ల్యాబ్ సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ జంట నగరాలలో అదనంగా 10 రేడియాలజీ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రికి పరీక్షలు కోసం వెళితే ప్రైవేట్ ల్యాబ్ లకు పంపేవారని..కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు.  ప్రజలు ప్రైవేటు ఆసుపత్రికి, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లొద్దన్న మంత్రి ఏ వైద్య పరీక్ష కావాలన్నా ప్రభుత్వాసుపత్రిలోనే చేస్తారని చెప్పారు.ప్రభుత్వాసుపత్రులలో అన్ని రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి హరీష్ రావు. 

అదేవిధంగా ప్రభుత్వాసుపత్రులలో నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలన్నారు హరీష్ రావు. అన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రులలో స్టెమీ కార్యక్రమం ద్వారా గుండెపోటు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 33జిల్లాలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 8 మెడికల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

జైలుకు ఎవరు పోతారో చూద్దాం

వాట్సాప్ లోనూ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ డౌన్ లోడ్