బండి సంజయ్.. దమ్ముంటే కేంద్ర ఉద్యోగాలు భర్తీ చేయించు

 బండి సంజయ్.. దమ్ముంటే కేంద్ర ఉద్యోగాలు భర్తీ చేయించు

సంగారెడ్డి : స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో 95శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,80,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. కేంద్రం అగ్నిపథ్ పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా చేసి యువతను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువశక్తిని వినియోగించుకోవడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. బండి సంజయ్ కు దమ్ముంటే ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయించాలని సవాల్ విసిరారు. 

సంగారెడ్డి పర్యటనలో భాగంగా రూ.50కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. బీసీ బాలికల వసతి గృహ భవనానికి శంకుస్థాపనతో పాటు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అనంతరం ప‌లు మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు.