వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులివ్వండి..కేంద్రమంత్రులకు విజ్ఞప్తి

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులివ్వండి..కేంద్రమంత్రులకు విజ్ఞప్తి

ఢిల్లీ పర్యటనలో మంత్రి హరీష్ రావు బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్వ్య్వస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 94(2) ప్రకారం నిధులు ఇవ్వాలని కోరారు. 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2020-21 సంవత్సరాలకు ఏడాదికి రూ.450 కోట్లు మేర నిధులు ఇచ్చారని.. 2014-15, 2019-20, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు తెలంగాణకు నిధులు మంజూరు చేయలేదన్నారు.  దీంతో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మేరకు 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సమావేశానంతరం కేంద్ర ఆర్థికమంత్రితో సమావేశమై వినతిపత్రాన్ని అందజేశారు.

ఆ తర్వాత మంత్రి హరీష్ రావు  కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టుల అంశంతో పాటు..  నూతన కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించారు.