తెలంగాణ కోసం జర్నలిస్టులు ఎంతో పోరాడారు

తెలంగాణ కోసం జర్నలిస్టులు ఎంతో పోరాడారు

అన్ని రంగాల్లో ఛాలెంజ్ ఎలా ఉన్నాయో మీడియా రంగంలో కూడా జర్నలిస్టులు ఛాలెంజ్ తో కూడిన ఉద్యోగం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన ఇవాళ సిద్దిపేట పట్టణంలో జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పత్రికలు, ఛానళ్లు బాగా పెరిగాయన్నారు. జర్నలిస్టులకు పోలీసు, వైద్య రంగంలో ఫ్రీ టైం, సెలవలు కూడా ఉండవు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. కొన్ని సంస్థల్లో పని చేసే వారికి డబ్బులు ఇస్తుంటే, కొన్ని సంస్థలు జర్నలిస్టుల నుండి డబ్బులు తీసుకుంటున్నారని తెలిపారు.

రాజకీయ నాయకులు ఎలా ఐతే రాజకేయం వదిలి వెళ్లరో, అలాగే జర్నలిస్టు కూడా వృత్తిని వదిలి వెళ్ళాలి అంటే సుముఖత వ్యక్తం చేయరని మంత్రి హరీష్ వ్యాఖ్యానించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నా చేతుల మీదుగా ఇవ్వడం సంతోషంగా ఉంది అన్నారు. జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కపడుకోండి, ప్రతి రోజు వ్యయాయం చేయండి అని సూచించారు. త్వరలో మీడియా కుటుంబ సభ్యులకు హెల్త్ పరీక్షలు చెపిస్తా, యోగ కోసం ఒక్క ఉపాద్యాయుని పెట్టి మీకు యోగ సెంటర్ ను పెట్టిస్తా తెలిపారు. జర్నలిస్టులు వెల్ నేస్ సెంటర్ ను ఉపయోగించుకోవాలన్నారు.

జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల స్థలాలు కేటాయిస్తా అని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం జర్నలిస్టుల పోరాటాలు చేశారు, మీ పాత్ర మరువలేనిది, సిద్దిపేట నియోజకవర్గ కోసం ఎన్నో వార్తలు రాశారు, దాని వల్ల జర్నలిస్టులు సిద్దిపేట ఖ్యాతిని పెంచారన్నారు. 2008లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.. నీళ్లు, రైల్వే, జిల్లా అని అప్పుడే హామీ ఇచ్చారు. 2022 వరకు నీళ్లు, జిల్లా రెండు పనులు అయ్యాయి, త్వరలో రైల్వే స్టేషన్ వస్తుంది అన్నారు. రానున్న రోజుల్లో ఆయుష్ ఆసుపత్రిని తీసుకొస్తా.. జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు.