
డాక్టర్లను ఆదేశించిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు: పిల్లల్లో జన్యు లోపాలను నివారించేందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, తనకు నివేదిక ఇవ్వాలని నిమ్స్, ఎంఎన్‌జే హాస్పిటళ్ల డాక్టర్లను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ రెండు దవాఖాన్ల పనితీరుపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి మంగళవారం రివ్యూ చేశారు. పిల్లల్లో వచ్చే జన్యులోపాలను గుర్తించేందుకు అవసరమైన అన్ని టెస్టులు నిమ్స్‌లో చేయాలని, సాధ్యమైనంతవరకు ఆ సమస్యలను పరిష్కరించేందుకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని సూచించారు.
ఇందుకోసం ఏమేం కావాలో చెబితే.. ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిమ్స్, ఎంఎన్‌జేలో పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టు ఓపీ కౌంటర్లు పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన పెంచాలని, బ్రెయిన్ డెడ్ నిర్ధారణ కేసుల్లో కుటుంబ సభ్యులను ఒప్పించాలన్నారు.