రాష్ట్రపతి ఇచ్చిన జీవోను రద్దు చేయమంటారా?

రాష్ట్రపతి ఇచ్చిన జీవోను రద్దు చేయమంటారా?

317జీవో ఎందుకు రద్దు చేయాలని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ లో జరిగిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు హరీశ్ రావు. ఈ సందర్బంగా మాట్లాడిన హరీశ్.. బీజేపీ ధర్నాలు చేసి ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన జీవోను రద్దు చేయమంటారా? అసలు బీజేపీ నాయకులు తెలివి ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. కేంద్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. విభజన టైంలో స్థానికత ఆధారంగా ఉద్యోగాలివ్వబోమని కేంద్రం చెప్పిందన్నారు. ఇప్పుడు స్థానికత అంటూ బీజేపీ  నాయకులు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలివ్వకుండా బీజేపీ అడ్డుకుంటుందన్నారు. జీవోలు అమలు కాకుండా బీజేపీ కోర్టుకెళ్తుందన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు బీజేపీ మాయలో పడొద్దన్నారు.  పండిన పంట కొనమంటే కేంద్రం మొండికేసిందన్నారు. మా ఏడు మండలాలను గుంజుకుందన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు.  రైతులకు బీజేపీ చేసిందేమి లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఏం చేశారన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ ఇవ్వలేదన్నారు.