
హైదరాబాద్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్.. కాంగ్రెస్రన్అవుట్అవుతాయని.. కేసీఆర్ వంద సీట్లు గెలిచి సెంచరీ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవదని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. పీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, ఏఎస్రావు నగర్ డివిజన్ కాంగ్రెస్కార్పొరేటర్సింగిరెడ్డి శిరీష, యాంకర్ బిత్తిరి సత్తి (రవికుమార్ముదిరాజ్) శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనన్నారు. టికెట్లు అమ్ముకునే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తుందన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు.. ముఠాలు.. మంటలని ఆయన విమర్శించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కాకుంటే హైదరాబాద్ కూడా అమరావతి లెక్కనే అయితదని, బిజినెస్‌లు పడిపోతాయనే ఆందోళన ఉందన్నారు.
రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా.. బలహీన నాయకత్వం ఉండాలా అనేది జనం నిర్ణయించుకోవాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి సినీ నటులు సూపర్ స్టార్ రజనీకాంత్, సన్నీ డియోల్ ఆశ్చర్యపోయారని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు.
కేసీఆర్ అంటే నమ్మకం
అబ్దుల్లాపూర్‌మెట్ : అరవై ఏండ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని పనులు సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం పరిధి మన్నెగూడలోని ఓ గార్డెన్లో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్ అని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు.
కేసీఆర్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ అంటే ఒక నాటకమని ఆయన విమర్శించారు. సోషల్ మీడియాలో సెన్షేషన్ కోసం చేసిన వీడియోలు, వార్తలను నమ్మొద్దని.. కళ్లతో చూసినవే నమ్మాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, సత్తు వెంకటరమణా రెడ్డి, సిక సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.