పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లినట్లే.. గ్రౌండ్ కు తీసుకెళ్లాలి

పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లినట్లే.. గ్రౌండ్ కు తీసుకెళ్లాలి

క్రీడలతో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. సెల్ ఫోన్లతో పిల్లలు టైం వెస్ట్ చేసుకోకుండా.. క్రీడ్రాలపై ఇంట్రెస్ట్ చూపాలన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ ముప్పిరెడ్డిపల్లిలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో మంత్రి పాల్గొన్నారు. పిల్లల్ని క్రీడల్లో పోత్సహించాల్సిన బాధ్యత తలిదండ్రులపై ఉందన్నారు హరీశ్. సెల్ ఫోన్లకు అలవాటు పడిపోవడం వల్ల..చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, షుగర్లు వస్తున్నాయన్నారు. ఇవి రాకుండా ఉండాలంటే‌‌ వ్యాయమం అవసరమన్నారు. విద్యార్థులు పాస్‌ కాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని… క్రీడాస్ఫూర్తి అలవాటు కాకపోవడమే ఇందుకు కారణమన్నారు. పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లినట్లే గ్రౌండ్ కు‌ తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు హరీశ్.

ఈ ఎన్నికల్లో గెలిస్తేనే భవిష్యత్.. మంత్రులపై కేటీఆర్ సీరియస్