పవర్ ఫుల్ స్టేట్ గా తెలంగాణ

పవర్ ఫుల్ స్టేట్ గా తెలంగాణ

సంక్షేమ పథకాల అమలులో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధును తీసుకొచ్చామన్నారు. ఈ పథకం అమలు వేగంగా పూర్తిచేస్తామని..దళితుల ఆర్థికాభివృద్ధి కోసం వారి ఖాతాల్లో 10 లక్షల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు.రాష్ట్రంలో నూతన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చామని..దాదాపు 300 వైన్ షాపులు దళితులకు కేటాయించామని చెప్పారు.అన్ని ప్రభుత్వ టెండర్లలో ఎస్సీలకు అవకాశం ఇస్తున్నామన్నారు.దళితుల సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు హరీష్ రావు.బడ్జెట్ లో రూ.17,800 కోట్లను దళిత బంధు పథకం కోసం కేటాయించామని చెప్పారు.ఈ ఏడాది 2 లక్షల మందికి దళిత బంధు ఇస్తామన్నారు. 

తెలంగాణలో పవర్ హాలిడే లేదు

అన్నివర్గాల శ్రమను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు హరీష్ రావు. ఎన్నికల కోసమే బీజేపీ స్టంట్ చేస్తుందన్నారు. తెలంగాణలో పవర్ హాలిడే లేదని..మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తున్నారన్నారు. దేశంలో ని సగం రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయని..కానీ తెలంగాణా లో కరెంట్ సమస్య లు లేవన్నారు. దేశంలోనే తెలంగాణ పవర్ ఫుల్ స్టేట్ గా మారిందన్నారు.సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో కరెంట్ సమస్య లేకుండా చేశారని చెప్పారు.దేశం మొత్తం కరెంట్ సంక్షోభంలో ఉంటే తెలంగాణ లో వెలుగు జిలుగులు ఉన్నాయన్నారు. కేంద్రం తీరు వల్లనే దేశం మొత్తం కరెంట్ సంక్షోభంలో ఉందన్నారు. కేంద్ర వైఖరి వల్ల సామర్థ్యం ఉన్నా  ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో దేశం మొత్తం కరెంట్ కోతలు ఎదుర్కొంటుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు