
- కాంగ్రెస్‌వస్తే గల్లీకో పేకాట క్లబ్
- మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: మోదీ ఢిల్లీలో అవార్డులు ఇస్తరు.. ఇక్కడికి వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నరు అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్అధికారంలోకి వస్తే గల్లీకో పేకాట క్లబ్ఏర్పాటు చేస్తారని ఆరోపించారు. కేసీఆర్ వచ్చాక మంచినీటి సమస్య తీర్చారని పేర్కొన్నారు. ఉప్పల్నియోజకవర్గం మల్లాపూర్‌లో నిర్వహించిన మహిళా సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
‘సిటీలో ఇంటింటికి మంచి నీళ్లు అందించినం. నీటి బిల్లులు కూడా లేవు. మిషన్ భగీరథకు కేంద్రం అవార్డుల మీద అవార్డులు ఇచ్చింది. కానీ ప్రధాని మోదీ వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారు. మన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ కాపీ కొట్టింది. కాంగ్రెస్ హయాంలో గల్లికో పేకాట క్లబ్బులు ఉండేవి. పేకాట క్లబ్బు నుంచి కోట్ల రూపాయలు కాంగ్రెస్ నేతల జేబుకు వెళ్లేవి. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే పేకాట క్లబ్బులు వస్తాయి. కేసీఆర్ వచ్చాక పేకాట క్లబ్బులను ఉక్కు పాదంతో తొక్కేశారు’ అని హరీశ్అన్నారు.