ఇది రైతు సంఘర్షణ కాదు..రాహుల్ సంఘర్షణ సభ

ఇది రైతు సంఘర్షణ కాదు..రాహుల్ సంఘర్షణ సభ

రాహుల్ గాంధీ  వరంగల్ సభపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఓడగొట్టిందన్నారు. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ ను  చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఇది  రైతు సంఘర్షణ సభ కాదని.. రాహుల్ సంఘర్షణ సభ అని అని  తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారన్నారు.  ఎయిర్ పోర్టులో దిగి ఇవాళ ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన  రాహుల్ కు  తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమేనన్నారు..