లద్నాపూర్​లో మంత్రి హరీశ్​కు నిరసన సెగ

లద్నాపూర్​లో మంత్రి హరీశ్​కు నిరసన సెగ

అడ్డుకుని వినతిపత్రం ఇచ్చిన ​భూ నిర్వాసితులు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో మంత్రి హరీశ్​రావుకు నిరసన తెగ తగిలింది. మంథనిలో ఓ కార్యక్రమానికి వస్తున్న మినిస్టర్​ను మంగళవారం రామగిరి మండలం లద్నాపూర్​వద్ద భూనిర్వాసితులు అడ్డుకున్నారు. ఓసీపీ కింద భూములు కోల్పోయిన వారందరూ నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో సింగరేణి యాజమాన్యం లద్నాపూర్​లో వారి ఇండ్లను కూల్చివేయడానికి ప్రయత్నించింది. అడ్డుకున్న నిర్వాసితులను పోలీసులు అరెస్ట్​ చేసి ​స్టేషన్​కు తరలించారు. ఆనాటి నుంచి ఏదో విధంగా నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. మంథని ఎంసీహెచ్​ఓపెనింగ్​కు మంత్రి వస్తున్నాడని తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం రోడ్డుపైకి వచ్చారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అయినప్పటికీ మంత్రిని అడ్డుకొని ఆర్​అండ్​ఆర్​ప్యాకేజీ ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు.