ఇంత పంట పండిందంటే కేసీఆర్ పుణ్యమే: హరీశ్‌రావు

ఇంత పంట పండిందంటే కేసీఆర్  పుణ్యమే: హరీశ్‌రావు

యాసంగిలో  భారీగా పంట పండింది అంటే అది సీఎం కేసీఆర్  పుణ్యమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం పూర్తి కావడం వల్లే వేల టన్నుల ధాన్యం పండుతుందని ఆయన గుర్తుచేశారు. రైతు పడించిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని..  గిట్టుబాటు ధర కూడా ఇస్తుందని తెలిపారు. పక్కా రాష్ట్రంలో వరి ధాన్యం కొనడం లేదని మంత్రి విమర్శించారు. అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పెద్దమ్మ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తిమ్మాయిపల్లి నుంచి నర్మెట్ట వరకూ రూ.86 లక్షల వ్యయంతో.. రోడ్డు పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.


 తెలంగాణ వచ్చాక ఆకుపచ్చ పల్లెలుగా మారాయని మంత్రి హరీష్ రావు అన్నారు అన్నారు. రైతులు పంట మార్పిడి చెయ్యాలని సూచించారు. ఇలా చేస్తే పంటలకు రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. పంటలకు రసాయన ఎరువులు వాడకం దగ్గించాలని, రైతులు పంట దిగుబడి కోసం జీలుగు, జనుము వాడాలని సూచించారు. రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని.. అలా చేస్తే భూమి బలం తగ్గుతుందని పేర్కొన్నారు. రైతుల కరెంట్ బిల్లు కేసీఆర్ కడుతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాలిపోయే మీటర్లు, ఎండిన పొలాలు ఉండేవని హరీశ్‌ రావు విమర్శించారు.